
రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో ఓ కొత్త చర్చ మొదలైంది. ఆమె తన ముఖానికి ఏదో ట్రీట్‌మెంట్ చేయించుకుందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్ తీసేందుకు ఆమె నిరాకరించడమే ఇందుకు కారణమైంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె, ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు..
బ్లాక్ అవుట్‌ఫిట్, బ్లాక్ మాస్క్‌తో సింపుల్‌గా ఉన్న రష్మికను చూసి ఫొటోగ్రాఫర్లు ‘మేడమ్, మాస్క్ తీయండి’ అని కోరారు. దానికి ఆమె నవ్వుతూనే, ‘ఫేస్ ట్రీట్‌మెంట్ అయ్యింది గయ్స్, తీయలేను’ అని సున్నితంగా తిరస్కరించారు. ఈ ఒక్క మాటతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. రష్మిక తన అందాన్ని పెంచుకునేందుకు ఏదైనా కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ చేయించుకుందా? ముఖ్యంగా పెదవులకు సంబంధించిన ట్రీట్‌మెంట్ ఏమైనా తీసుకుందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..!!

