
ఈ నెల 31 వరకూ రాష్ట్రమంతా లాకౌట్ అని.. రవాణా సంస్థలతో సహా న్నీ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరాడు. ఈ ట్వీట్‌పై అనసూయ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ నిర్ణయాన్నినేను సమర్థిస్తాను. ఇలా వారం పాటు అన్నీ ఆపేస్తే .. నాలా రోజు వారీ పనులకు వెళ్లే వాళ్ల పరిస్థితి ఏంటి? మేము పనులకు వెళ్లకుంటే ఇంటి అద్దె, పవర్ బిల్లులు, ఈ.ఎం.ఐ.లు, ఇతర ఖర్చులు ఎలా భరించాలి’ అంటూ ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్ ను ఉద్దేశించి అనసూయ పై ఓ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అసలు నువ్వు రోజు వారి కూలి గురించి ఆలోచించడం ఏంటి కామెడీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్లందరి అకౌంట్ లను ఆమె బ్లాక్ చేస్తూ వస్తుందట. అలా బ్లాక్ చేసి చేసి చేతులు నొప్పెడుతున్నాయి అని కూడా కూడా ఈమె ట్వీట్లు చేస్తుండడం గమనార్హం.

