నందమూరి కళ్యాణ్ తన లేటెస్ట్ ఫిల్మ్ ‘డెవిల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కన్ఫామ్ చేశాడు. ‘అప్డేట్స్ గురించి వద్దని.. మొన్న తమ్ముడు కూడా చెప్పాడు..కానీ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తరువాత సినిమా చేయాలంటే ఒక హీరో, డైరెక్టర్ లేదా ప్రొడక్షన్ హౌస్‌కి చాలా బాధ్యత ఉంటుంది. ఒక చిన్న అప్డేట్‌లో కూడా తేడా ఉంటే మీరు ఊరుకుంటారా? త్వరలోనే దేవర గ్లింప్స్ రాబోతోంది..అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో దేవర టీజర్ డేట్ ఎప్పుడో చెప్పాలంటూ..మేకర్స్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు..
అయితే.. అప్డేట్స్ విషయంలో గతంలో ఓ సారి ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యాడు ఎన్టీఆర్. అమిగోస్ ఈవెంట్‌లో.. ‘ఏదైనా అప్డేట్ ఉంటే, మా ఇంట్లో వాళ్ల కన్నా ముందు మీకే చెప్తాము, అప్పటివరకు వెయిట్ చెయ్యండి’.. అని చెప్పాడు. అప్పటినుంచి కాస్త సైలెంట్‌గానే ఉన్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. దేవర అప్డేట్స్ కావాలంటూ పెద్దగా డిమాండ్ చేయడం లేదు. కానీ ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టారు నందమూరి అభిమానులు. మరి ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు తారక్ నుంచి ఎలాంటి రిప్లే వస్తుందో చూడాలి..!!