in

Nazriya Nazim rejected me three times: Actor Suriya

Nazriya Nazim rejected me three times: Actor Suriya

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’. జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..

గతంలో తన మూడు సినిమాల్లో నటించాల్సిందిగా నజ్రియాను సంప్రదించగా, ఆమె తిరస్కరించినట్లు సూర్య వెల్లడించారు. “ఒక మంచి నటితో కలిసి పనిచేయాలని నేను అనుకున్నాను. మేము మూడుసార్లు అడిగాం, కానీ ఆమె తిరస్కరించింది. ఇది నాలుగో ప్రయత్నం, ఇప్పుడు ఓకే చెప్పింది. గత 12 ఏళ్లలో ఎంతోమంది దర్శకులు, నటుల ఆఫర్లను ఆమె వద్దనుకుంది. చివరకు మా సినిమాను అంగీకరించినందుకు ధన్యవాదాలు” అని సూర్య తెలిపారు..!!

Telugu girl Satvika Veeravalli onboard for rc17?