in

Nayanthara To Work With Mythri Movie Makers!

కానొక దశలో ఏ సెట్ పై చూసినా మైత్రీ వారి సినిమాలే కనిపించాయి. అలాంటి ఈ బ్యానర్ పై ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పూర్తయిన తరువాతనే మిగతా ప్రాజెక్టుల సంగతిని ఆలోచన చేద్దామని మైత్రీవారు అనుకున్నారట.  ‘పుష్ప 2’ సినిమా విడుదల తరువాత ఈ బ్యానర్ తమిళంలో నయనతార ప్రధానమైన పాత్రగా ఒక సినిమాను నిర్మించి, పాన్ ఇండియా స్థాయిలో దానిని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.

ఆల్రెడీ ఈ కథను నయనతారకి వినిపించడం..ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఇంతవరకూ నయనతార అందుకోని పారితోషికాన్ని మైత్రీ వారు ఆఫర్ చేసినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ కథ ఏ జోనర్ కి సంబంధించినది? దర్శకుడు ఎవరు? ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే, ‘పుష్ప 2’ విడుదల కావలసిందేనట. కనుక అప్పటివరకూ వెయిట్ చేయవలసిందే..!!

Rajkumar Hirani to work with Ram Charan next?

Samuthirakani To Reprise The Role Of A communist?