
ఇన్నాళ్లు తన లవ్ బ్రేకప్స్ పై ఎక్కడ మాట్లాడకుండా మౌనం వహించిన సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టికేలకు దీని పై మాట్లాడారు.. ప్రస్తుతం విగ్నేష్ తో ప్రేమలో ఉన్న నయనతార..దీనికి ముందు శింబు ఇంకా ప్రభు దేవా తో అఫైర్ నడిపిన సంగతి తెలిసిందే..ప్రభుదేవా తో పెళ్లి అవుతుంది అని అంత భావించిన ఆది ఎందుకో జరగలేదో..ఆ ఇద్దరిని వదిలేసినా తరువాత నయన్ వారిపై తొలిసారి స్పందించింది. నమ్మకం లేని చోట ప్రేమ నిలబడదు. నా జీవితంలో రెండు సార్లు ప్రేమ విఫలం కావడానికి అదేకారణం. నమ్మకం లేని చోట కలిసుండడం కన్నా విడిపోవడమే మంచిదని వారితో నా బంధాన్ని వదులుకున్నాను. అప్పుడు ఎంత బాధపడ్డానో ఎవ్వరికి తెలీదు. ఆ బాధ కేవలం నాకు మాత్రమే తెలుసు. ఆ సమయంలో నేను మాట్లాడకపోయే సరికి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకున్నారు. అవన్ని చూసిన నేను వాటిపై ఏమీ మాట్లాడలేదు. ఆ బాధ నుంచి బయటికి రావడానికి నాకు చాలా సమయమే పట్టింది. సినిమాల వల్లే నేను తిరిగి కోలుకున్నాను. అభిమానులు ఎల్లప్పుడూ నా వెంటే ఉంటూ నాకు అండగా నిలిచారు. నేను ఒక్కటే నిర్ణయించుకున్న జీవితంలో ఏం జరిగినా సరే.. ఎప్పటికి సినిమాలను వదలకూడదని అని నయనతార చెప్పుకొచ్చింది.

