in

Nayanthara apologises for hurting religious sentiments!

చిత్రం హిందూవుల మనోభావాలను దెబ్బతీసిందని..తాను..తన టీమ్‌ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోవడం లేదని..తన సినిమా పై నెలకొన్న వివాదం పై క్షమాపణలు తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌ స్టాలో జై శ్రీరామ్‌ అంటూ నోట్‌ షేర్‌ చేసింది. జై శ్రీరాం..గత కొన్ని రోజులుగా నా సినిమా ‘అన్నపూరణి’ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నాను.

‘అన్నపూరణి’ సినిమాను కేవలం కమర్షియల్‌ ఉద్దేశ్యంతో కాకుండా ప్రజల్లోకి మంచి ఆలోచనను తీసుకెళ్లే ప్రయత్నంగా చూశాం. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనతోనే ఈ సినిమాను చేశాం. కేవలం ఈ మూవీ ద్వారా సానుకూల సందేశాన్ని అందించాలని భావించాము.. కానీ మాకు తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచామని తెలిసింది. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు, నా టీంకు లేదు..!!

person behind deepfake video of Rashmika arrested!

jailer Sequel To come Soon!