in

natural star Nani says a big no to TV shows!

ర్శకుడవుదామని ఇండస్ట్రీకి వచ్చిన నాని ఇప్పుడు హీరోగా సెటిలయ్యారు. న్యాచురల్ స్టార్ గా సూపర్ హిట్ సినిమాలను అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరోవైపు “హిట్” సినిమాతో నిర్మాతగా కూడా మారిన నాని బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించి టీవీ ప్రేక్షకులను సైతం అలరించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీవీ షో లో పోస్ట్ గా వ్యవహరించడం ఇక తన వల్ల కాదని భవిష్యత్తులో కూడా టీవీ షోలను హోస్ట్ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని తేల్చి చెప్పాడు నాని. బిగ్బాస్ సీజన్ 2 కి పోస్టింగ్ వ్యవహరిస్తున్నప్పుడు నానిపై చాలానే ట్రోల్స్ వచ్చాయి.

అందుకే హర్ట్ అయిన నాని ఈ నిర్ణయానికి వచ్చారని కొందరు అభిమానులు చెబుతున్నారు. నిజానికి బిగ్బాస్ సీజన్ 2 తర్వాత నానికి చాలా టీవీ షో లో నుంచి ఆఫర్లు వచ్చాయట. కానీ నాని మాత్రం ఏవి ఒప్పుకోలేదు. కేవలం సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఇకపై కూడా కేవలం సినిమా మీదే ఫోకస్ చేస్తానని అంటున్నారు నాని. ఇక నాని టీవీ షోల కి గుడ్ బై చెప్పేసినట్లే. సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓటీటీలలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

adah sharma stills at her home!

bad sentiment follows nithin’s ‘maestro’!