
విశ్వనాధ్ గారి డైరక్షన్ లో వచ్చిన చిత్రం సప్తపది, అందులో నటించిన హీరో కూడా గుర్తు ఉండే ఉంటాడు కానీ పేరు గుర్తు లేదు కదూ. అతను తరువాత శుభలేఖ, మంచు పల్లకి వంటి విజయవంతం అయినా చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలు చేసారు కానీ ఆ తరువాత చిత్రాలలో ఎక్కడ కనిపించ లేదు, కారణం 1985 లో తెలుగు చిత్ర సీమ హైదరాబాద్ కు తరలి రావటం. ఇంతకీ అతని పేరు చెప్ప లేదు కదూ, అతని పేరు గిరీష్ ప్రధాన్, కన్నడిగుడు, సప్తపది లో నటించినప్పటికీ అతనికి తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. గిరీష్ సప్తపది లో సెలెక్ట్ అవటం చాల డ్రమాటిక్ గ జరిగింది. గిరీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, విశ్వనాధ్ గారి టీం ఇన్స్టిట్యూట్ కు సెలెక్షన్స్ కోసం వెళ్ళినపుడు గిరీష్ లేరు, మరుసటి రోజు విశ్వనాథ్ గారి అడ్రస్ తీసుకొని వారిని ఇంటి వద్ద కలిశారు, తెల్లగా, నాజూకుగా, ఉంగరాల జుట్టు తో ఉన్న గిరీష్ మొదటి చూపులోనే విశ్వనాథ్ గారికి నచ్చారు, తన వెంట బుచ్చి రెడ్డి వారి ఆఫీస్ కి తీసుకొని వెళ్లి, అక్కడే ఉన్న హీరోయిన్ సబితా గారి తో ఫోటో షూట్ చేసి , అడ్రస్ తీసుకొని కబురు చేస్తాం అంటూ పంపించి వేశారు. ఆ తరువాత రెండు వారాలు ఎటువంటి కబురు అందలేదు గిరీష్ గారికి, లైట్ తీసుకొన్న గిరీష్ ఒక రోజు టీ.నగర్ లో ఆటో కోసం వెయిట్ చేస్తుంటే, ఒక అంబాసిడర్ కారు వచ్చి తన ముందు ఆగింది, అందులో నుంచి దిగిన అసోసియేట్ డైరెక్టర్ విజయ్ గారు, ఏమై పోయావు బాబు నీ కోసం వేదకాని చోటు లేదు, విశ్వనాధ్ గారేమో హీరో ఎక్కడ అంటూ మా ప్రాణం తీస్తున్నారు ఎక్కు, ఎక్కు అంటూ కారు ఎక్కించుకొని విశ్వనాధ్ గారి వద్దకు తీసుకెళ్లారు.గిరీష్ తనకు తెలుగు రాదు అని చెప్పిన, అతనికి ధైర్యం చెప్పిన విశ్వనాధ్ గారు, ఒక కండిషన్ పెట్టారు హీరో ప్లుటిస్ట్ కాబట్టి ఫ్లూట్ ప్లే చేయటం నేర్చుకోమన్నారు,అల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అయిన ప్రభాకర్ రావు వద్ద వన్ మంత్ ఫ్లూట్ నొటేషన్స్ నేర్చుకున్న తర్వాత, గిరీష్ గారి సీన్స్ షూట్ చేసారు విశ్వనాధ్ గారు.సప్తపది సూపర్ హిట్ అయింది గిరీష్ గారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది, సినిమా పూర్తి ఆయె సరికి గిరీష్ గారు కూడ తెలుగు మాట్లాడటం నేర్చుకున్నారు. మీకు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, రఘువరన్ బి, టెక్, అండ్ రాంచరణ్ సినిమా బ్రూస్లీ లో నెగటివ్ రోల్స్ చేసిన అమితేష్ ప్రధాన్, గిరీష్ ప్రధాన్ కుమారుడే.

