నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కానీ పైలెట్ తిరుపతిలో దిగాల్సిన విమానాన్ని బెంగుళూరులో సురక్షితంగా దించాడు. అయితే రాజమండ్రిలో ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కిన రోజా తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా. అనుకోకుండా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఉదయం10:55 గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉన్న ఈ విమానంలో టెక్నీకల్ ప్రాబ్లమ్స్ రావటం..
ల్యాండ్ అవ్వకుండా అక్కడే గాలిలో గంట పాటు చక్కర్లు కొట్టింది రోజా ఎక్కిన విమానం. అయితే ఈ సాంకేతిక సమస్యలని పసిగట్టిన పైలెట్ చాల చాకచక్యంగా ప్రవర్తించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లారు. ఆ సమయంలో విమానంలోని 70 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరందరిని కూడా సురక్షితంగా బెంగుళూరులో ల్యాండ్ చేశాడు పైలెట్. అయితే ఈ అనుకోని సంఘటనపై స్పదింస్తు రోజా ఒక వీడియో షేర్ చేసింది. ‘ఇంకా విమానంలోనే ఉన్నాం. విమానం డోర్స్ ఓపెన్ కాలేదు. పైలట్‌కు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’ అని రోజా ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.