అల్లరి నరేష్, తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరు గ మార్చుకున్న మంచి నటుడు, నరేష్ సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తీసుకొని రావాలని ఈ.వి.వి. గారు అనుకుంటున్న సమయం లో. మొదటి సారిగా నరేష్ ను నటుడిగా చేయమని సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? ది గ్రేట్ ఆక్టర్ అమితాబ్ బచ్చన్ గారు. ఈ.వి .వి . సినిమా బ్యానర్ లో ఈ.వి.వి. గారు నిర్మించిన చాల బాగుంది చిత్రం 100 డేస్ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిధి గ వచ్చిన అమితాబ్ గారు, నరేష్ ను చూడటం జరిగింది, తనికెళ్ళ భరణి గారు నరేష్ ను అమితాబ్ కు పరిచయం చేసారు. వెంటనే అమితాబ్ గారు అభిషేక్ బచ్చన్ లాగా ఉన్నాడు ఇతడిని నటుడిగా ఇంట్రడ్యూస్ చేయండి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పారు భరణి గారితో, ఆ విషయం ఈ.వి.వి. గారి చెవిలో వేశారు భరణి,
అప్పటివరకు నటుడు అవ్వాలని నరేష్ కు కోరిక ఉన్న , ఎలా నాన్న దగ్గర చెప్పాలో తెలియక సందిగ్ధం లో ఉన్న నరేష్ కూడా తన మనసులో మాట బయట పెట్టేసారు, ఓ. కే. చెప్పిన ఈ.వి.వి. గారు యాక్టింగ్ క్లాసులకు పంపించారు. నరేష్ ను చూసిన రవి బాబు తన మొదటి చిత్రం అల్లరి లో హీరో రోల్ కోసం అడిగారు, కానీ ఈ.వి.వి. గారు, రవి నీకు ఫస్ట్ టైం వాడికి ఫస్ట్ టైం కాస్త ఆలోచించుకో అంత రిస్క్ అవసరమా ? అని సలహా ఇచ్చారు, అయినా కూడా రవి బాబు నరేష్ ని తన అల్లరి సినిమా తో వెండి తెరకు పరిచయం చేసారు. అమితాబ్ గారి ఆశీర్వాదం, రవి బాబు నరేష్ లోని నటుడిని గుర్తించటం వలన నరేష్ అనే నటుడు తెలుగు వెండితెర కు పరిచయం అయ్యారు . కామెడీ మాత్రమే కాదు, సీరియస్, అండ్ సాఫ్ట్ రోల్స్ కూడా చేయగలడు అని నిరూపించుకున్నారు నరేష్ గారు. బిగ్ బి ఆశీర్వాదం, తండ్రి గారి క్రమశిక్షణ నరేష్ ను ఒక మంచి నటుడిగా తీర్చిద్దిదాయి అని చెప్ప వచ్చు.