in

Naresh and Pavithra Lokesh’s fake marriage misleads media!

టి పవిత్రతో యాక్టర్ నరేష్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న విషయం వారి కుటుంబంతో పాటు యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఈ మధ్యే వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకుంటూ ఓ వీడియో వదిలాడు నరేష్. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం మీ ఆశీస్సులు కావాలని చెప్పుకున్నాడు. నరేష్ త్వరలోనే పవిత్రను పెళ్లాడబోతుండటం పైగా కిస్ పెట్టుకొని వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు వీకే నరేష్. పవిత్ర, తను మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యామని చెప్తూ ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ ఇంత సైలెంట్ గా ఎలా పెళ్లి చేసుకున్నారని ? అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ వీడియోస్ వెనుక పెద్ద ప్లానే ఉంది.

నరేష్ , పవిత్ర లోకేష్ జంటగా ఓ ప్రేమ కథ తెరకెక్కుతుంది. వీరిద్దరి నిజ జీవితాన్ని కథగా మార్చి స్క్రీన్ మీదకు తీసుకొచ్చే సినిమా రెడీ అవుతుంది. దానికి సంబంధించి ఇంకా డీటైల్స్ బయటికి రాలేదు కానీ ఈ ముద్దు , పెళ్లి ఇవన్నీ ఆ సినిమాలోనివే. వీరిద్దరికీ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ను వాడుకునే ప్రయత్నంగా వస్తున్న సినిమా ఇది. ఇక నరేష్ , పవిత్ర లోకేష్ ఎలా కలిశారు ? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది ? తర్వాత సహజీవనం ఇలా నరేష్ , పవిత్రల కథతోనే సినిమా రాబోతుంది. దానికోసమే నరేష్ ఇలా హాట్ టాపిక్ అయ్యే వీడియోస్ రిలీజ్ చేస్తున్నాడు. త్వరలోనే ఇవన్నీ సినిమా కోసమని ప్రకటించి అందరినీ ఫూల్స్ చేసి సినిమా చూడండి అనే చెప్పే ప్లానింగ్ లో ఉన్నాడు..!!

Ram Charan’s Hollywood entry, announcement soon?

40 YEARS FOR ABHILASHA!