ప్రస్తుతం బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో “బీబీ 3” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతే కాకుండా ఇప్పటికే మేకర్స్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేస్తునట్టు ప్రకటించారు. దాంతో బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు. అదే నెలలో మెగాస్టార్ సినిమా కూడా ఉండటంతో బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద కచ్చితంగా ఢీ కొడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
nara rohit as mla in balayya – boyapati movie!
అంతే కాకుండా ఇప్పటికే బాలయ్యకు సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ లు అందించిన బోయపాటి తో సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో నారా రోహిత్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతొంది, సినిమాలో ఓ ఎమ్మెల్యే పాత్రలో నారా రోహిత్ కనిపించబోతున్నాడని… అది ఒక నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.