in

nani’s heroine priyanka Roped In For Ravi Teja’s ‘Khiladi’!

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌పై కన్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’ మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్‌ వర్మ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తయింది. తర్వలోనే షూటింగ్‌కి కూడా సిద్ధం అవుతుంది టీమ్‌. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్‌ నటించనున్నారని ఇప్పటికే వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే.. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌ గా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ను తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రియాంక “గ్యాంగ్‌ లీడర్‌” లో నాచురల్‌ స్టార్‌ నాని సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Singer Sunitha gets engaged!

MASS MAHARAJ RAVITEJA IN MARVEL DAREDEVIL TELUGUSWAG EDITS