in

nani to produce a web series soon!

నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో రాబోతున్న ‘వి’ చిత్రం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా నాని ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తను రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌ను రూపొందించే యోచనలో ఉన్నానని తెలిపాడు. ఇక తన ‘వి’ చిత్రం ఆన్‌లైన్‌లో విడుదల అవుతుందని తాను ముందే భావించానని, ఇప్పుడు అది జరుగుతోందని నాని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు ఇద్దరి పాత్రలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. అయినా ఇంద్రగంటి వైవిధ్యం ఉంటేనే సినిమా చేస్తాడు, పైగా హీరోను చాలా సహజంగా చూపిస్తాడు. నానితో చేసిన రెండు సినిమాల్లోనూ నానిని డిఫ‌రెంట్‌ యాంగిల్ లో చూపించి నానికి రెండు సూపర్ హిట్ సినిమాలను ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు నానిని విలన్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తూ.. నాని నటనా జీవితంలోని మరో కోణాన్ని పరిచయం చేయబోతుండటంతో ఈ సినిమా కోసం నాని కూడా బాగా ఆత్రుతగా ఉన్నాడు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి హిట్ ని ఇస్తోందో చూడాలి.

pooja hegde in pawan harish film!

venkatesh clarity on f2 sequel!