
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” సినిమా హీరో నవీన్ పోలిశెట్టి ఆ సినిమా తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తాను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పటినించి “నీ గోల్ ఒక్కటే ఐ ఐ టీ” అని చెప్పే వారట నవీన్ తండ్రి, నవీన్ కూడా దాని కోసం కస్టపడి చదివాడు కానీ దురదృష్టవశాత్తు ఐ ఐ టీ లో సీట్ రాలేదు, యెన్ ఐ టీ భోపాల్ చదవవలసి వచ్చింది కానీ సాయి శ్రీనివాస్ ఈ మధ్య ఐ ఐ టీ లో చేరాడు,అదేంటి,యాక్టింగ్ మానేసి మళ్ళి కాలేజీ లో చేరాడు అనుకుంటున్నారా అయితే మీరు పప్పు లో కాలేసినట్లే.ఈ యంగ్ హీరో “ఛిచోరే” అనే హిందీ మూవీ లో సుశాంత్ సింగ్ రాజపుత్, శ్రద్ధ కపూర్ తో కలసి నటిస్తున్నాడు ఆ షూటింగ్ ఐ ఐ టీ ముంబై లో జరిగింది. ఆ సందర్భం లో బుక్స్ పట్టుకొని ఐ ఐ టీ క్లాస్ రూమ్ లో అడుగు పెట్టారు మన నవీన్ పోలిశెట్టి, ఆ విధంగా తన తండ్రి కోరిక తీర్చినట్లు అయింది. సామాన్యులకు ఎవరికీ ఉండని అవకాశం ఒక్క నటులకు ఉంటుంది,వాళ్ళు యాక్టర్ అయితే చాలు, డాక్టర్, లాయర్, పోలీస్ ఆఫీసర్ ఇలా ఏదయినా అవ్వచ్చు. ఒక విధంగా అది వారి లక్ అనే చెప్పాలి.

