in

nagarjuna rejected durandhaar chance, here’s the truth!

కూలీ’లో ప్రతినాయకుడిగా అద్భుతమైన నటన కనబరిచిన నేపథ్యంలో, ‘ధురంధర్‌’లో అవకాశం వచ్చినా వదులుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్‌’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో రెహమాన్ డెకాయిట్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అయితే, ఈ పాత్రకు మొదట నాగార్జునను సంప్రదించారని, ‘కూలీ’ సినిమా షూటింగ్ వల్ల ఆయన తిరస్కరించారని కథనాలు వెలువడ్డాయి.

ఈ ప్రచారంపై నాగార్జున స్పందిస్తూ, ‘‘అలాంటిదేమీ లేదు. నాకు ఎవరూ ఏ పాత్ర ఆఫర్ చేయలేదు. అయితే, ‘ధురంధర్‌’ ఒక సూపర్ మూవీ. దర్శకుడు ఆదిత్యధర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన తీసిన ‘యూరి’ కూడా నాకిష్టం. సినిమాలో అక్షయ్ ఖన్నా నటన హైలైట్‌గా నిలిచింది. సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని తెలిపారు. ‘ధురంధర్‌’ వంటి చిత్రాలు చూశాక, ప్రేక్షకులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కథలను ఆదరిస్తున్నారని అర్థమైందని నాగార్జున పేర్కొన్నారు..!!

prabhas Injured on the Sets of Hanu Raghavapudi’s Fauzi!

actress Shriya Saran reveals her dream role!