in

Nagarjuna picks Sonal Chauhan as replacement for pregnant kajal!

ప్రస్తుతం నాగార్జున ‘ది ఘోస్ట్‌’ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుంది. అంతేకాక…ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాతో భారీ విజయం సాధించారు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున ‘ది ఘోస్ట్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుంది. అంతేకాక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోయిన్స్ తప్పుకున్నారు. సినిమా మొదలు పెట్టినప్పుడు ఈ సినిమాకి కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. ఒక షెడ్యూల్ తర్వాత కాజల్ ప్రెగ్నెన్సీ రావడంతో సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని తీసుకున్నారు. కానీ ఇటీవల జాక్వెలిన్ ఒక కేసులో ఇరుక్కోవడంతో ఆమె కూడా సినిమా నుంచి తప్పుకుంది.

దీంతో మరో హీరోయిన్ వేటలో పడ్డారు చిత్ర బృందం. తాజాగా సోనాల్ చౌహన్ ని తీసుకున్నట్టు సమాచారం. బాలకృష్ణ సరసన ‘లెజెండ్‌’, ‘రూలర్‌’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సోనాల్ ప్రస్తుతం ‘ఎఫ్‌3’ సినిమాలో నటిస్తుంది. తాజాగా నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ఘోస్ట్‌’ సినిమాకి సోనాల్ ని ఓకే చేసినట్టు సమాచారం. త్వరలో ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది.

Here’s How Shruti Haasan And Santanu started Their Love affair!

Love is not real, it is just a chemical reaction: Puri Jagannath