నాగార్జున ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను మొదలు పెట్టాలని అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఎందుకో గాని సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. అసలు మొదలు కాకపోవచ్చు అనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే మరోవైపు నాగార్జున ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తో ఒక సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఇప్పటికే సిద్ధమైంది.
అయితే హీరోయిన్ విషయంలో మాత్రం దర్శకుడు ఊహించిన సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో మర్చిపోలేని కొన్ని సినిమాలు చేసిన సీనియర్ బ్యూటీ టబు ను ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. వీరి కాంబినేషన్లో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇన్నాళ్ళకు మళ్ళీ దర్శకుడు అజయ్ భూపతి ఈ కాంబినేషన్లో ఒక డిఫరెంట్ సినిమాను ప్రజెంట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ రానుంది..!!