కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన బెంగళూరు బేస్డ్ వ్యాపారవేత్త కుమార్తె అయిన ఆమె 2019 సంవత్సరానికి గాను డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంపాదించింది. అలాగే 2020 సంవత్సరానికి కూడా డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంపాదించింది. అలాగే అండర్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ అవార్డు కూడా ఆమె సంపాదించింది. ఇక మోస్ట్ క్రియేటివ్ ఇంటీరియర్ డిజైనర్ 2020 ఫర్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అవార్డు కూడా ఆమె సంపాదించింది. ఆమె చదువు విషయానికి వస్తే బెంగళూరు జైన్ యూనివర్సిటీలో ఆమె బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసింది. తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది..ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ లో కూడా మరోసారి ఎంబీఏ చేసిన ఆమె..
ఆ తర్వాతే న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ లో ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత ఆమె జైన్ యూనివర్సిటీ కి మార్కెటింగ్ ఇంటర్న్ గా కూడా పనిచేశారు 2018 జనవరిలో ఈ అనూష శెట్టి డిజైన్స్ ఓపిజి ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించి బెంగళూరు, బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలలో మాత్రమే కాకుండా కర్ణాటక, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాజెక్టులు చేసినట్లు తెలుస్తోంది. ఆమె తనకు మొత్తం ఆరు భాషల్లో మాట్లాడగలనని తన లింక్డ్ ఇన్ బయోలో పేర్కొంది..అన్నట్టు ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా నాగశౌర్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతని ఇంటి పేరు మూల్పూరి. అలాంటి వ్యక్తి వేరే రాష్ట్రానికి చెందిన బంట్ అనే సామాజిక వర్గానికి చెందిన ఈ అనూష శెట్టిని వివాహం చేసుకోవడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.