in

naga chaithanya to romance his brother akhil’s heroine!

ఇంతకుముందు ఒక మెగా హీరో నటించిన హీరోయిన్ తో మరొక మెగా హీరో రొమాన్స్ చేసే వాళ్ళు. కాజల్ అగర్వాల్, తమన్నా వంటి హీరోయిన్లు అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అక్కినేని బ్రదర్స్ కూడా హీరోయిన్లను మార్చుకుంటున్నారు. ప్రముఖ ముంబై బ్యూటీ సాక్షి వైద్య ఈమధ్య టీవీ యాడ్స్ లో కనిపిస్తూ పాపులర్ అయింది.

తాజాగా ఈమె అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న “ఏజెంట్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. తాజాగా ఈమె నాగచైతన్యతో కూడా రొమాన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం.యువ హీరో అక్కినేని నాగచైతన్య కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సాక్షిని హీరోయిన్గా ఎంపిక చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Radhika Apte Does Not Like To Undergo Facial & Body Surgery!

Sony Charishta hot Stills at 101 Trends Exhibition!