in

naga chaithanya and samantha are in plans to shift to goa?

టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ వంక చూస్తోంది. పాన్ ఇండియా హ‌డావుడి పెరిగింది క‌దా. మార్కెట్ ని పెంచుకోవాల‌నో, బాలీవుడ్ వాళ్ల‌కు ట‌చ్‌లో ఉండాల‌నే ముంబైకి మ‌కాం మార్చేస్తున్నారు. హైద‌రాబాద్ లో ఇల్లు ఉన్నా, ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుని అప్పుడ‌ప్పుడూ అక్క‌డ‌కి వెళ్లొస్తున్నారు. అలా అంద‌రూ ముంబై మాయ‌లో ప‌డిపోతే.. నాగ‌చైతన్య‌, స‌మంత మాత్రం గోవా వెళ్లిపోతున్నారు. అవును.. త్వ‌ర‌లోనే చైతూ, స‌మంత గోవా షిఫ్ట్ అవుతున్నార‌ని ఇండ్ర‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇటీవ‌ల గోవాలో బీచ్ ప‌రిసరాల్లో ఓ ఖ‌రీదైన స్థ‌లాన్ని చైతూ, స‌మంత కొనుగోలు చేశార్ట‌. స‌ముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈ స్థ‌లంలో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకుని, అక్క‌డే సెటిల్ అయిపోవాల‌ని ఈ జంట భావిస్తోంది. ప్ర‌స్తుతానికి ఫామ్ హోస్‌కి సంబంధించిన ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని 2022 నాటికి… వీరిద్ద‌రూ మ‌కాం గోవాకి మార్చేస్తార‌ని తెలుస్తోంది. స‌మంత – చైల‌కు గోవా ఫేవ‌రెట్ హాలిడే స్పాట్. అక్క‌డ ఓ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఆ క‌ల ఇలా తీరింద‌న్న‌మాట‌.
Pragya Jaiswal’s Stills at an Event

Pragya Jaiswal’s Stills at an Event

kajal agarwal’s sister to give re entry with daggubati heroes!