in

Naga Chaitanya plays Mahesh Babu’s fan in ‘Thank You’!

థ్యాంక్ యు’ సినిమాలో చైతూ మహేష్ బాబుకు వీరాభిమానిగా నటిస్తున్నాడు. టీనేజీలో ఉన్నపుడు మహేష్ అంటే పడి చచ్చేలా ఉంటుందట అతడి క్యారెక్టర్. ఇప్పటికే చైతూ మీసం గడ్డం తీసేసి, చిన్న కుర్రాడిలా మారిన లుక్ ఒకటి ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ లుక్‌తోనే తాజాగా షూట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఆ సన్నివేశం ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లబోతోంది.

మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ టైంలో మహేష్ అభిమానిగా చైతూ చేసిన సందడిని ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఒక థియేటర్ ముందు మహేష్ బాబు భారీ కటౌట్ పెట్టి.. దాన్ని చైతూనే ఆవిష్కరించే సన్నివేశం తీసింది ‘థ్యాంక్ యు’ టీం ఈ మధ్యే. చైతూ కటౌట్ పైకి నిచ్చెన ద్వారా వెళ్లడం.. పైన తెరను తీసి మహేష్ కటౌట్‌ను ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం.. వీడియోలో కనిపిస్తోంది. సంబంధిత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. .

People Felt My Body Isn’t Normal, says ileana!

rana gives one more chance to sukumar’s assistant!