in

Naga Chaitanya in satires mode on Samantha’s ‘Sam Jam’ Show!

ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటారు. తాజాగా స్యామ్ జామ్ షోకు వచ్చాడు నాగ చైతన్య. అందరికంటే చివర్లో ఈయన వచ్చాడు. దీనిపై కూడా సెటైర్లు వేసాడు చైతూ. వీడు ఇంట్లోనే పడుంటాడు కదా.. ఎప్పుడు పిలిచినా వస్తాడులే అనుకుని చివర్లో నన్ను పిలిచావ్ అంటూ భార్యపై సెటైర్ వేసాడు. దానికి స్యామ్ నవ్వేసి ఊరుకుంది. ఆ తర్వాత నాకు హోస్టుగా ఎన్ని మార్కులు వేస్తావ్ అంటూ నీకు అడ్వైస్ ఇస్తే తీసుకుంటావా.. ఇంట్లోనే తీసుకోవు కదా అంటూ మరో పంచ్ వేసాడు స్యామ్.

వరుసగా భార్యను టార్గెట్ చేస్తూ పంచులు వేస్తూనే ఉన్నాడు నాగ చైతన్య. దాంతో సమంత మొహం చిన్నబోయింది. అంతేకాదు వంటల గురించి అడిగితే అసలు నువ్వెప్పుడు చేసావ్ వంట.. మొత్తం మంటేగా అంటూ మరో సెటైర్ వేసాడు. కనీసం నేను కాలేజ్ వెళ్లాను.. నువ్వు అసలు కాలేజ్ మొహమైనా చూసావా అంటూ రెచ్చిపోయాడు. గ్యాప్ లేకుండా సమంతతో ఆడుకున్నాడు చైతూ. మధ్యలో సమంత ఆపాలని ట్రై చేసినా కూడా ఎక్కడా బ్రేకులు వేయలేదు ఈయన.

anasuya sensational comments on tollywood producers!

big boss beauty divi in pawan kalyan’s next?