సినీ నటుడు నాగార్జున వరుసగా రెండో సీజన్ లో కూడా బిగ్ బాస్ షోలో అదరగొడుతున్నారు. ఈ సీజన్ లో టాప్ సెలబ్రిటీలు లేకపోయినా తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ, ప్రేక్షకులను మెప్పిస్తూ, షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. నాగ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల పాటు బిగ్ బాస్ షోకు ఆయన దూరం కానున్నారనేదే ఆ వార్త. త్వరలోనే థాయ్ లాండ్ లో కీలకమైన షెడ్యూల్ ని షూట్ చేయనున్నారు. కనీసం 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నేపథ్యంలో నాగార్జున బిగ్ బాస్ కు దూరం కానున్నారు. అంటే కనీసం 6 ఎపిసోడ్లలో ఆయన కనిపించకపోయే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో రమ్యకృష్ణ లేదా మరెవరితోనైనా షోను రన్ చేయించాలనే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారు.