in

jr ntr, ram charan resume shoot for ‘rrr’!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR..రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ క్రేజీ మూవీ షూటింగ్‌‌ను మళ్లీ మొదలు పెట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.. ‘విశ్రాంతి.. పునరుత్తేజం.. ఉత్సాహంతో ముందుకు..’ అంటూ #WeRRRBack అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. చిత్రీకరణ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నామని తెలిపింది. ఇక చివరగా జూనీయర్ ఎన్టీఆర్ (భీమ్) లుక్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళినుంచి వస్తున్న సినిమా ఇది… ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి.

anushka to announce new movies soon!

f cube ‘sp Balasubrahmanyam’!