రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు
కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా కల్కి 1 లో కృష్ణుడి పాత్రను చూపించి కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ తో డబ్బింగ్ చెప్పించారు. అయితే కల్కి పార్ట్ 2 లో కృష్ణ పాత్ర ఎలాబిరేట్ చేసి, ఫేస్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ కృష్ణుడి క్యారక్టర్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కల్కి పార్ట్ 2 లో కూడా శ్రీకృష్ణుడి లుక్‌ను రివీల్ చేయాలని అనుకోవడం లేదని, కారణం సినిమా పై ఆ పాత్ర ఎఫెక్ట్ ఎక్కువ అయ్యి ట్రాక్ తప్పిపోతుంది అని తెలిపారు.
ప్రభాస్ కల్కి సినిమాలో శ్రీ కృష్ణుడిగా మహేష్ బాబు!
అంతే కాదు ఒక వేళ మూవీలో కృష్ణుడి పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటే అందులో మహేష్ బాబు నటిస్తే ఫేస్ రివీల్ చేస్తా అని మాటిచ్చాడు నాగ్ అశ్విన్. నిజంగా అదే నిజమైతే కల్కి రేంజ్ మరికొంత పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కాస్టింగ్ కి మహేష్ ఛరిష్మా కూడా తోడైతే ఇంకేమైనా ఉందా. అశ్విన్ మనసులో లేకుండా ఈ మాట రాదుగా అని సినీప్రియులు గుసగుస లాడుతున్నారు. అయితే కల్కి 2 లో మహేష్ ని కృష్ణుడిగా చూసే ఛాన్స్ ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికే కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని తెలిపాడు అశ్విన్..!!