in

nabha is the best option for young heroes!

టాలీవుడ్‌లో ఇప్పుడు యంగ్‌హీరోస్‌కి సరైన హీరోయిన్లు దొరకట్లేదు. లావణ్యత్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్లు మునుపటిలా మేజిక్‌ చెయ్యలేకపోతున్నారు. పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి స్టార్ హీరోయిన్లు కుర్రాళ్లతో స్టెప్పులెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దీంతో చిన్నపాటి వ్యాక్యూమ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సిట్యువేషన్‌నే కరెక్ట్‌గా వాడుకుంటోంది నభ.

నభా నటేశ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో అందరినీ మాయ చేసింది. కొంచెం బోల్డ్‌ మరికొంచెం నాటీ క్యారెక్టర్‌తో కుర్రాళ్లకి కనెక్ట్ అయ్యింది. దీంతో యంగ్‌ హీరోలు నభాని బెస్ట్‌ ఆప్షన్‌గా చూస్తున్నారు. అందుకే వరుస అవకాశాలు అందుకుంటోంది నభ. ఈ బ్యూటీ ప్రస్తుతం సాయి తేజ్‌తో ‘సోలో బ్రతుకే సో బెటర్’, బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు చేస్తోంది. వీటితోపాటు రవితేజతోనూ ఓ మూవీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. సో ఈ లిస్ట్‌ చూస్తే నభ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారుతున్నట్లే కనిపిస్తోంది.

we do only pan india movies : charmi

Silence Mean Trisha’s Marriage is Confirmed?