స్క్రీన్ మీద హీరోలు చాలా మందే ఉంటారు, కానీ ఆఫ్ ది స్క్రీన్ కూడా హీరోలా ప్రవర్తించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. రియల్ లైఫ్ లో టఫ్ టైమ్స్ లో బేలగా ఏడ్చేసే వారు ఉంటారు, ప్రమాద సమయంలో కారు దిగి పారిపోయిన వారు ఉంటారు, వారందరు తెర మీద మాత్రమే హీరోలు, కానీ రియల్ లైఫ్ లో కూడా హీరో లాగ బెహేవ్ చేసే వారు తక్కువ మందే ఉంటారు. యెన్.టి.ఆర్. క్రమశిక్షణ కు మారు పేరు, అదే విధం గ ధైర్య సాహసాలలో కూడా ముందే ఉండే వారు. 1974 లో, వాహిని స్టూడియోలో, “దీక్ష” అనే సినిమా షూటింగ్ జరుగుంతుంది. ఆ చిత్రంలోని హీరో యెన్.టి.ఆర్. నాప రాయిని జరపగా, దాని కింద ఉన్న పాము అతనిని కాటు వేసే సన్నివేశం తీస్తున్నారు.మాములుగా ఇటువంటి సీన్లు తీస్తున్నపుడు, పాము నోటిని కుట్టేస్తారు కానీ పొరపాటున ఆ రోజు పాము నోరు కుట్టలేదు. యెన్.టి.ఆర్ నాప రాయి జరపగానే బయటకు వచ్చిన పాము యెన్.టి.ఆర్ ను నిజంగానే కరిచింది.
అయన చేతి మీద గాయం చూసిన అక్కడ ఉన్న వారు ఆ పాముల వాడిని నిలదీస్తే, వాడు అసలు విషయం చెప్పాడు. అందరు కంగారు పడి పోయారు, హాస్పిటల్ కి పోదామన్నారు, కానీ యెన్.టి.ఆర్. చేతిని గట్టిగ నొక్కి పెట్టి అలాగే షూటింగ్ కంటిన్యూ చేసారు .సాయంత్రం ఆరు గంటల వరకు షూటింగ్ చేసి ఇంటికి వెళ్లిపోయారు. యెన్.టి.ఆర్. రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. యూనిట్ సభ్యులకు నిద్ర లేదు, ఏమవుతుందో అని టెన్షన్ ఎందుకయినా మంచిది అని విషం విరుగుడు ఇంజక్షన్ రెడీగా పెట్టుకొని కూర్చున్నారు. తెల్లవారు ఝాము నే నిద్ర లేచిన యెన్.టి.ఆర్. తన ఇంట్లో ఉన్న దర్శక, నిర్మాతలను చూసి, ఏమిటి బ్రదర్ మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగారట, మీకు పాము కరిచింది కదా అని, అంటూ నసుగుతున్న వారిని చూసి, ఒక నవ్వు నవ్వి మాకేమి కాదు బ్రదర్ మీరు కంగారు పడకండి, వెళ్లి షూటింగ్ కి సిద్ధం చేసుకోండి అని చెప్పారట. సాధారణంగా పాము విషం కన్నా భయం వలన ఎక్కువ మంది చని పోతుంటారు. యెన్.టి.ఆర్. భయపడ కుండా ఉండటం వలనో, లేక ఆ పాములో విషం తక్కువ ఉండటం వలనో ఆయన కు ప్రమాదం జరగలేదు, కానీ ఆయన గుండె ధైర్యానికి హాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు..!!