క్లిష్టమయిన డైలాగ్స్ కి పెట్టింది పేరు నందమూరి తారక రామ రావు, చాంతాడంత డైలాగ్స్, సంస్కృత పదాలు , సమాసాలతో అదరగొట్టి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన యెన్.టి.ఆర్.దానవీర శూర కర్ణ సినిమాలో యెన్.టి.ఆర్. చెప్పిన డైలాగ్స్, ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఎవరు మరచి పోలేరు, సాంఘిక చిత్రాల సంగతి ఎలా ఉన్న పౌరాణిక చిత్రాలలో యెన్.టి.ఆర్. కి డైలాగ్స్ రాసేటప్పుడు రైటర్స్ కూడా చాలా జాగ్రత్త తీసుకొనే వారు, ఆయన పలికే స్టైల్ ని బట్టి చాల జాగ్రత్తగా రాసె వారు. అటువంటి యెన్.టి.ఆర్. గారికి ఒక పదం పలికేది కాదు అంటే మీరు నమ్మగలరా? అవును ఇది నిజం, తన లోపాన్ని గుర్తించిన యెన్.టి.ఆర్. ఎంతో తెలివి గ దాన్నిఎలా కవర్ చేసే వారో చూడండి.
ఏ సందర్భం లో అయినా యెన్.టి.ఆర్. “చూశారా”, అని పలకవలసి వచ్చినప్పుడు, ” చూచారా” అని పలికే వారు, రైటర్స్ చూశారా అని రాసేవారు, యెన్.టి.ఆర్ మాత్రం చూచారా అని పలికే వారు, రెండిట్లో ఏది కరెక్ట్ అనే మీమాంసలోకి అందరి నెట్టేసే వారు యెన్.టి.ఆర్. భాష మీద ఎంతో పట్టు ఉన్న యెన్.టి.ఆర్. ఉచ్చారణ కరెక్ట్ కాదని ఎవరు చెప్ప లేక పోయే వారు, ఇది కూడా కరెక్ట్ ఏమో? ఎందుకు వచ్చిన గొడవ అని అందరు మౌనంగా ఉండిపోయే వారట. సో, చూచారా అనే పదం కూడా కరెక్ట్ అని అన్నగారు అన్న తరువాత ఎవరయినా కరెక్ట్ కాదు అనే సాహసం చేస్తారా?