in

‘mythri movie makers’ locked uppena director bucchi babu again!

ప్పన.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నానుతున్న సినిమా. పరిశ్రమలో కూడా ఈ సినిమా చర్చలే ఎక్కడ చూసినా. ఈ సినిమా తీసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా పేరు కూడా మార్మోగిపోతోంది ఇండస్ట్రీలో. తొలి సినిమాతో హిట్టు కొడితే ఆ దర్శకుడి జాతకం ఒక్క రాత్రిలో మారిపోతుంది. రిలీజ్ రోజు సాయంత్రం నుంచే కాల్స్‌తో ఫోన్ మోత మోగిపోతుంది. అందులో అభినందనల కాల్స్‌తో పాటు ఆఫర్ల కాల్స్ కూడా పెద్ద ఎత్తునే ఉంటాయి. ఐతే ‘ఉప్పెన’ సినిమా ఔట్ పుట్ చూసి బుచ్చిబాబు టాలెంట్ ఏంటో పసిగట్టిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు..

అతణ్ని వెంటనే బయటికి వదలకూడదని ఫిక్సయిపోయారట. ప్రస్తుతం టాలీవుడ్లో ఫామ్‌లో ఉన్న ఏ దర్శకుడూ, ఏ హీరోనూ వదలుకుండా కమిట్మెంట్లు తీసుకుంటున్న మైత్రీ సంస్థ.. తమ సంస్థలోనే పరిచయం అయిన ప్రతిభావంతుడైన దర్శకుడిని ఎలా వదిలి పెడుతుంది? ‘ఉప్పెన’ రిలీజ్ కంటే ముందు అతడిని మైత్రీ అధినేతలు లాక్ చేసేసినట్లు సమాచారం. బుచ్చిబాబు మరో రెండు సినిమాలు మైత్రీకే చేశాకే బయటికి వెళ్లేలా అగ్రిమెంట్ ఎప్పుడో రాయించేసినట్లు సమాచారం. బుచ్చిబాబు రెండో సినిమాకు కథ కూడా ఎప్పుడో రెడీ అయిందట..

Ravi Teja registers new production company – RT Works!

keerthy suresh’s mom responds about her daughter marriage rumors!