అవకాశాలు రాకపోవడం కాదు, తన వద్దకు వస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి, కథ కథనాల విషయంలో మృనాల్ ఆచి తూచి వ్యవహరిస్తుండడం వల్లే పెద్ద ప్రాజెక్టుల్లో ఆమె కనిపించడంలేదని అంటున్నారు. పైగా, ఓ సినిమా చేస్తూనే నాలుగైదు సినిమాలకు కమిట్ అయిపోవాలన్న తొందర కూడా మృనాల్ ఠాకూర్‌కి లేదట.
రెమ్యునరేషన్ విషయంలో కూడా మృనాల్ ఠాకూర్, చాలా రెస్పెక్టబుల్‌గా బిహేవ్ చేస్తోందని అంటున్నారు. ఈ మధ్యనే ఓ స్టార్ హీరో నటించే సినిమాకి సంబంధించి మృనాల్ ఠాకూర్‌ని దర్శకుడొకరు సంప్రదిస్తే, సింపుల్‌గా ‘నో’ చెప్పిందట ఆమె. సినిమాలో గ్లామర్ తప్ప, తనకు నటించేందుకే అవకాశం లేదని మృనాల్ ఆ కథ విన్నాక భావించడంతోనే ‘నో’ చెప్పాల్సి వచ్చిందని అంటున్నారు. ఓ సీనియర్ హీరో సినిమా ప్రస్తుతం చర్చల దశలో వుందట..!!