డ్రైవర్ రాముడు అనే చిత్రం కోసం, తెలుగు చిత్ర రంగ చరిత్రలో మొట్ట మొదటి సారిగా పూర్తి పాటను కదులుతున్న ట్రైన్లో చిత్రీకరించారు. 1978 లో నందమూరి హరికృష్ణ గారు, రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానేర్ లో, రాఘవేంద్ర రావు డైరెక్షన్లో, యెన్,టి.ఆర్. హీరోగా నిర్మించిన చిత్రం “డ్రైవర్ రాముడు”. ఈ చిత్రంలో యెన్.టి.ఆర్. సరసన జయసుధ హీరోయిన్ గ నటించారు. ఈ చిత్రంలోని ” దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కింది” అనే పాట చిత్రీకరణ, అరకు లోయలోని రైల్వే ట్రాక్ మీద, ఒక ఓపెన్ బోగి లో, కదులుతున్న ట్రైన్లో యెన్.టి.ఆర్., జయసుధ మీద చిత్రీకరించటం జరిగింది. ఆ తరువాత తెలుగులో వచ్చిన కొన్ని చిత్రాలలో ట్రైన్ లో పాటలు చిత్రీకరించారు. కానీ మొట్ట మొదటి ట్రైన్ పాటగా డ్రైవర్ రాముడు చిత్రంలోని పాట గుర్తింపు తెచ్చుకుంది.