in

mohan babu’s ‘son of india’ shooting started!

చాలా కాలం తరవాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అయన లీడ్ రోల్ లో ‘స‌న్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ రోజే (అక్టోబర్ 23) ప్రారంభమైంది. హైద‌రాబాద్‌లోని మోహ‌న్‌బాబు నివాసంలో ముహూర్త‌పు షాట్‌తో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. మంచు లక్ష్మి , విద్యా నిర్వాణ సంయుక్తంగా ముహూర్త‌పు షాట్‌ కొట్టగా, మంచు విష్ణు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్ష‌న‌ల్ టీమ్‌కు అందించారు. విరానికా మంచు, ఐరా, అవ్ర‌మ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

i am not dating anyone says nidhi agarwal!

balayya creates a new record!