
కీర్తి సురేష్ నటిస్తున్న మరో భారీ చిత్రం కూడా ఓటీటీ బాటపడుతోందంటూ గత కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` ఇటీవలే డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అదే తరహాలో కీర్తిసురేష్ నటించిన మరో చిత్రం `మిస్ ఇండియా` కూడా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన చర్చల్లో నిర్మాత కోనేరు మహేష్ పాల్గొంటున్నారని, ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ కంపెనీతో మహేష్ డీల్‌ని ఫైనల్ చేసుకున్నారని తెలిసింది. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్‌పై క్లారిటీ రానుందని ఇన్ సైడ్ టాక్.

