in

miss bikini actress Archana Gautam, now Congress candidate, has a request!

సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. నటించేవారు పరిపాలించలేరు అనే ధోరణిని చాలామంది నటీనటులు తుడిచేశారు. ప్రస్తుతం ఎంతోమంది రాజకీయనాయకులు నటులుగా గుర్తింపు తెచ్చుకున్నవారే. ఇక ఇందులో హీరోయిన్లు కూడా ఉన్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోకసభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నుస్రన్ జహాన్, మీమీ చక్రవర్తి లాంటి వారు టీఎంసీ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

ఇక వీరి బాటలోనే మరో మోడల్ ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన అర్చనా గౌతమ్ అనే మోడల్ ను హస్తినాపుర్ అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఫిబ్రవరిలో జరగబోయే ఈ ఎన్నికల కోసం ఆమె ప్రచారంలో పాల్గొంటుంది. గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఈమె ఎవరు అని ప్రజలు గూగుల్ ని అడగగా ఆమె గత జీవితం మొత్తం బయటికి వచ్చింది. 2018లో మిస్ ఇండియా బికినీగా గెలిచిన అర్చనా గౌతమ్, 2018లో మిస్ కాస్మో వరల్డ్ గానూ, 2014లో మిస్ ఉత్తరప్రదేశ్ గానూ నిలిచింది. ఇక ఈ ప్రచారంలో అర్చన బికినీ ఫోటోలను షేర్ చేస్తూ..

ఇలాంటివారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటిపై అర్చన స్పందిస్తూ ” నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వస్తునాన్నో తెలుసుకొని ఓటు వేయండి. నా సొంత ఊరిలో రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి విని, వారికి ఏదోఒకటి చేయాలనే పట్టుదలతో నేను ఇందులోకి వచ్చాను.. ప్రజలు తన ఇష్టాన్ని గౌరవించి వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలకు ముడిపెట్టకుండా నాకు ఓటు వేయాలని కోరుతున్నాను అని చెప్పుకొచ్చింది.

hero!

milky beauty thamanna best plans for her career!