in

mehreen reveals her dream about meeting anushka!

హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భ‌జ‌న్ లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం పూర్తి చేసుకున్న మెహ‌రీన్.. పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్ కు గురి చేసింది. ప్ర‌స్తుతం త‌న ఫోక‌స్ అంతా సినిమాల‌పై పెట్టిందీ భామ‌. త్వ‌ర‌లో ఎఫ్ 3 సినిమాతో ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి వ‌స్తున్న మెహ‌రీన్ అభిమానుల‌తో కొన్ని విష‌యాలు షేర్ చేసుకుంది. నాన్న త‌న‌ను ఐఏఎస్ గా చూడాల‌నుకున్నా..త‌న‌కు మాత్రం ల‌క్ష్యం అంటూ ఉండేది కాద‌ని, అనుకోకుండానే సినిమాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పింది మెహ‌రీన్‌.

నేను ఇంజినీర్‌, డాక్ట‌ర్, ఆర్కిటెక్ట్ ఇలా ఎవ‌రినీ క‌లిసినా వారిలా అవ్వాల‌నుకునేదాన్ని. ఎవ‌రికైనా తెలిసిన అబ్బాయో, లేదంటే హీరోపైనో క్ర‌ష్ ఉంటుంది కానీ నేను మాత్రం మా ఫ్యామిలీ డాక్ట‌ర్ అంటే ఇష్ట‌ప‌డేదాన్ని. చిన్న‌ప్ప‌టి నుంచి అనుష్క‌కు వీరాభిమానిని. ఆమె బాహుబలిలో చేసిన దేవ‌సేన పాత్ర‌కు నేను ఫిదా అయిపోయాను. అనుష్క‌ను క‌లిసి మాట్లాడాల‌నుకున్న క‌ల మ‌హానుభావుడు ప్రివ్యూ స‌మ‌యంలో నెర‌వేరింద‌ని చెప్పుకొచ్చింది మెహ‌రీన్. స‌ల్మాన్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. స‌ల్మాన్ నాకంటే పెద్ద వాడ‌ని చాలా బాధ‌ప‌డ్డా. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను క‌లిసి మాట్లాడాన‌ని చెప్పుకొచ్చింది.

Anchor Varshini’s adorable Photoshoot!

shalini pandey mesmerized with outdoor photo shoot!