in

Mehreen Pirzada Upset Over Marital Rape Scene said As ‘romantic Scene’!

స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్న మోహ్రీన్..ఇటీవల ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. మెహ్రీన్ మొదటి సారిగా నటించిన వెబ్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఈ నెల 13న హాట్‌ స్టార్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ కాస్త బోల్డ్ సీన్స్ లో కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో మెహ్రీన్ ను పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా చేసినట్టు… సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో మెహ్రీన్ ఇష్టంగా రొమాన్స్ సీన్స్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ కి మెహ్రీన్ హార్ట్ అయింది.

అంతే కాదు..తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రెండు పేజీలు తన పాత్ర గురించి రాసుకొచ్చింది..సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో తాను చేసిన రొమాంటిక్ సీన్స్ ఇష్టంతో చేసినవి కాదని, పాత్ర డిమాండ్ చేస్తే చేయాల్సి వచ్చిందని అలాగే, ఆ పాత్ర చేసింది రొమాంటిక్ సీన్స్ అనడం కంటే, బలవంతం చేసే సీన్స్ అనడం కరెక్ట్ అంటూ రాసుకొచ్చింది. వైవాహిక జీవితంలో ఆ పాత్ర లైంగికంగా ఎదుర్కొన్న సమస్యలు వెబ్ సిరీస్ లో ఉన్నాయని, వాటిని చూడాలి కానీ రొమాంటిక్ సీన్స్ అంటూ కామెంట్స్ చేయొద్దు అంటూ చెప్పుకొచ్చింది..!!

shruthi hassan to reveal secret soon which cant be hidden!

ap minister Roja interesting comments on mahesh babu’s movie offer!