in

megastar to repeat god father combination?

చిరంజీవి ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీవశిష్ఠ దర్శకత్వంలో..యూవీ నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమౌతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత ఏ దర్శకుడితో చిరంజీవి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ డైరెక్టర్లు చాలామంది ఆయనతో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నారు..

ఈ నేపథ్యంలోనే దర్శకుడు మోహన్ రాజాతో సినిమాను చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు మోహన్ రాజా – చిరంజీవి కాంబినేషన్లో ‘గాడ్ ఫాదర్’ సినిమా వచ్చింది. ‘లూసిఫర్’ రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. 2022లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. అయితే ఇప్పుడు మోహన్ రాజా వినిపించిన కథ, చిరంజీవికి బాగా నచ్చిందట. అందువలన ఆయన ఈ ప్రాజెక్టును ముందుగా చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు..!!

TOP 10 MOST FOLLOWED TELUGU ACTORS ON TWITTER!

Rashmika Mandanna Special Song in Ram Charan’s Movie?