in

meera jasmine making comeback after a break of 6 years!

తెలుగు, తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్‌ మీరా జాస్మిన్. 2014లో దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటస్‌ను వివాహం చేసుకుంది. తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో విడిపోయారు. వ్యక్తిగత కారణాలతో సినీ రంగానికి దూరమైన మీరాజాస్మిన్‌ ఇప్పుడు వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రముఖ మలయాళీ దర్శకుడు సత్యన్‌ అంతీకాడ్‌ జయరాం ప్రధాన పాత్రధారిగా ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. ఇందులో హీరోయిన్‌గా మీరా జాస్మిన్‌ నటిస్తుందని ఆయనే తన ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. జూలైలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. తెలుగులో పందెంకోడి, మహారథి, గుడుంబా శంకర్‌, భద్ర చిత్రాల్లో మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించింది.

KRACK DIRECTOR USING THE SAME FORMULA FOR BALAYYA!

disha patani reveals about secret mole in her body!