in

mass maharaja gives green signal to sequels!

సీక్వెల్ ఓ విజ‌య సూత్రం. విజ‌య‌వంత‌మైన సినిమాని కొన‌సాగించ‌డం మామూలు విష‌యం కాదు. అంచ‌నాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకున్న సినిమాలూ త‌క్కువే. కాక‌పోతే… సీక్వెల్ అన‌గానే మార్కెట్ మొద‌లైపోతుంది. ఆ కాంబినేష‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో.. బిజినెస్ భారీగా జ‌రుగుతుంది. అది.. క‌చ్చితంగా ప్ల‌స్ పాయింటే. కాబ‌ట్టే సీక్వెల్స్ ప‌ల్టీ కొడుతున్నా – వ‌స్తూనే ఉంటాయి. ర‌వితేజ `కిక్‌` కి సీక్వెల్‌గా `కిక్ 2` వ‌చ్చింది. ఆసినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయినా స‌రే.. సీక్వెల్స్‌కి సై అంటున్నాడు మాస్ మ‌హారాజా. ఇటీవ‌ల విడుద‌లైన `క్రాక్‌`కి సీక్వెల్ వ‌స్తుంద‌ని..

ఆ సినిమా చివ‌ర్లో సూచ‌న ప్రాయంగా చెప్పేసింది చిత్ర‌బృందం. ఈ సినిమా సీక్వెల్ చేయ‌డానికి ర‌వితేజ కూడా రెడీగానే ఉన్నాడు. క్రాక్ జ‌రుగుతున్న‌ప్పుడే సీక్వెల్ చేద్దాం.. అని గోపీచంద్ మ‌లినేనికి చెప్పాడ‌ట ర‌వితేజ‌. అందుకే…. ఆ ధైర్యంతోనే క్లైమాక్స్ లో `క్రాక్ 2` వ‌స్తోంద‌ని చెప్ప‌గ‌లిగాడు. ర‌వితేజ దృష్టి మ‌రో సినిమాపై కూడా ఉంది. అదే… `రాజా ది గ్రేట్`. అనిల్ రావిపూడి న‌టించిన ఈసినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కి త‌గిన క‌థ అనిల్ రావిపూడి ద‌గ్గ‌ర రెడీగా ఉంది. “రాజా ది గ్రేట్ సీక్వెల్ చేద్దామ‌ని అనిల్ నాతో చెప్పాడు. ఓ లైన్ కూడా వినిపించాడు. అది చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది“ అని చెప్పుకొచ్చాడు ర‌వితేజ‌. సో… ర‌వితేజ నుంచి ఈ రెండు సీక్వెల్స్ రావ‌డం ఖాయ‌మ‌న్న‌మాట..

Pranitha subhash donates a lakh for Ram Mandir!

shruthi haasan reveals about her role in vakeel saab!