మణిరత్నం గారి ఫ్రెంచ్ బియర్డ్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఏముంటుందిలే సుహాసిని గారు ముద్దుగా అడిగి ఉంటారు, “నీకు ఈ పిల్లిగడ్డం బాగుంది మణి” అని అందుకే పెంచి ఉంటారు అనుకొంటున్నారు కదూ.కాదండి అసలు విషయం వేరే ఉంది. ” గురు” సినిమా టైం కి మణిరత్నం గారు క్లీన్ షేవ్ తో ఉండే వారు, ” రావణ్” సినిమా టైం లో ఎక్కువగా అవుట్ డోర్ లో ఉండటం వలన కొంచెం పెరిగిన గడ్డం తో కనిపించే వారు, ఒక్కో సారి షేవింగ్ చేసుకొనే టైం, ఓపిక లేక అలాగే ఉండి పోయేవారు. ఒక సారి షేవ్ చేసేటప్పుడు, ఫ్రెంచ్ బియెర్డ్ షేప్ వరకు, షేవ్ చేసి అలాగే వదిలేసారు. ఇక మన సినిమా వాళ్ళ సంగతి తెలిసిందే కదా చుసిన వారందరు మణి సార్ ,” రొంబ నల్ల ఇరికే సర్” అన్నారట.
ఇదేదో బాగుందే కంటిన్యూ చేద్దాం అనుకున్న మణి గారు, ఇంకొక గొప్ప రహస్యం కనిపెట్టారట, అదేమిటంటే ?ఆలా ఫ్రెంచ్ బియర్డ్ వదిలేయటం వలన షేవింగ్ చేసుకొనే సమయం మూడు నిముషాలు ఆదా అవుతుందట. టైం ఇస్ మనీ అంటారు కదా, అందుకే” షేవింగ్ లో సేవింగ్ “ను కంటిన్యూ చేశారట. అదండీ మణిరత్నం గారి పిల్లి గడ్డం వెనుక ఉన్న మినీ కథ. అసలు పూర్తి గ షేవింగ్ మానేస్తే ఇంకో మూడు నిముషాలు మిగులుతాయి కదా అని ఎవరో సినీ జ్ఞాని అన్నాడట! ఆబ్బె, అసలు ఖర్చు పెట్టకుండా పూర్తి గ సేవింగ్ చేయటం ఏమిటి, కొంత ఖర్చు చేసి, కొంత ఆదా చేస్తేనే అందం, ఆదాయం అన్నారట మణిరత్నం గారు.