రాజ బాబు , పేరు వినగానే అందరి ముఖాలలో నవ్వు విరిసేది, తెలుగు సినీ రంగంలో ఒక శకం ఆయనది. సినీ రంగ ప్రవేశం చేసిన కొత్తలో తిండికి గడవటం కూడా కష్టం గ ఉన్న రోజులు చూసిన రాజ బాబు, హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకొనే స్థాయి కి ఎదిగారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం రాజ బాబు గారిది. అయన తన తోటి నటి నటుల పట్ల ఎంతో స్నేహ భావంతో మెలగటమే కాకా, సీనియర్ నటులను సన్మానించి, ఆర్ధికంగా సహాయం చేసే వారు రాజ బాబు. దేవర్ ఫిలిమ్స్ నిర్మించిన” రాణి ఔర్ లాల్ ప్యారి” అనే హిందీ చిత్రం లో, ఒక పాట లో నటించారు రాజ బాబు, నిర్మాత ముందుగా ఎంత ఇస్తామో చెప్ప లేదు, రాజ బాబు కూడా ఇంత కావాలి అని అడగ లేదు, ఒకే ఒక్క పాట కాబట్టి ఒక అయిదు వేలు ఇస్తారేమో అనుకున్నారు. కానీ దేవర్ ఫిలిమ్స్ వారు ఏకంగా నలభై వేలు పారితోషికంగా ఇచ్చారు, ఆ రోజుల్లో అది చాలా పెద్ద అమౌంట్..
అంత అమౌంట్ తీసుకున్న రాజ బాబు గారు ఏం చేసారో తెలుసా? తాను మనసులో అనుకున్న అయిదు వేలు మాత్రం తీసుకొని, మిగిలిన ముఫై అయిదు వేలు సెట్ లోఉన్న లైట్ బాయ్స్ , జూనియర్ ఆర్టిస్ట్స్, మేక్ అప్ అసిస్టెంట్స్ కు పంచేసారట రాజబాబు. మనకు ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది, మిగిలింది దైవార్పితం అనే తాత్విక చింతన కలిగిన వారు రాజ బాబు గారు, ఆయన తెర మీద మాత్రమే కమెడియన్, నిజ జీవితం లో చాల లోతైన తాత్విక చింతన కలిగిన మనిషి రాజ బాబు గారు. అందుకు నిదర్శనం నిర్మాత గ ఆయన తీసిన “ఎవరికి వారే యమునా తీరే” ” మనిషి రోడ్డున పడ్డాడు” చిత్రాలు. ఆ చిత్రాలు ఆర్ధికంగా ఆయనకు కలసి రాక పోయిన, నిర్మాత గ అయన అభిరుచిని అందరి కి చాటి చెప్పాయి..!!