సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవికా ఇటీవల ఫాన్స్‌కు గుండె పగిలే నిజాన్ని ఎంతో సింపుల్‌గా నవ్వుతూ చెప్పేసింది. ఆమె మానసిక రుగ్మత గురించి అభిమానులకు తెలిపింది. దీంతో ఆమె అభిమానులు ఆశ్యర్యపోయారు. ఈ ముద్దుగుమ్మ క్లెప్లమెనియాక్ అనే చిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందట. ఈ సమస్య ఉన్న వారికి చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట.
ఏదైనా వస్తువు కళ్ల ముందు కనిపిస్తే చాలు దాన్ని దొంగతనం చేయాలని మనసు తెగ పీకులాడుతుంది. ఇది చాలా అరుదుగా ఉంటుంది. ఈ రోగం దాదాపు అందరిలో ఉన్నా, అంత సమస్యగా మారదు. కానీ ఒక హీరోయిన్‌కు ఇది ఉండటం చిన్న విషయం కాదు. ఈ సమస్య కారణంగా తాను ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డానని మాళవిక చెప్పింది. తన వెంట ఎవరైన ఉండి ఎప్పటికప్పుడు తన మనసును పక్క దారి పట్టిస్తూ ఉండటంతో పాటు నా మానసి స్థితిని గుర్తు చేస్తుంటారని మాళవిక చెప్పింది.