బాలీవుడ్‌లో 2004లో వచ్చిన మర్డర్ సినిమాతో ఒక్కసారి యావత్ దేశాన్ని తన వైపునకు తిప్పుకుంది మల్లికా షెరావత్. తన సౌందర్యంతో ప్రేక్షకుల గుండెలను పిండేసిన ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో తనకు ఎవ్వరూ సాటిరారని నిరూపించింది. బాలీవుడ్ చాలా మంది తనకు నటన రాదని, అందాల ఆరబోత, గ్లామర్‌తోనే నెట్టుకొచ్చినానని అనుకునేవారని మల్లికా షెరావత్ చెప్పింది. దీపికా పదుకొణె గెహ్రయాన్‌లో బికినీ వేస్తే అందరూ ప్రశంసించారని, కానీ తాను 15 ఏళ్ల క్రితమే ఆ పని చేశానని స్పష్టం చేసింది..
“మొదట్లో హీరోయిన్లు అందరూ చాలా మంచిగా ప్రవర్తించారు. సతీ సావిత్రీ మాదిరిగా అమయాకంగా ఉండేవారు లేదా క్యారెక్టర్ లేని వేశ్య పాత్రలైనా చేశేవారు. అప్పుడు కేవలం ఈ రెండు రకాల పాత్రలే హీరోయిన్లకు ఉండేవి. కానీ ప్రస్తుంత వచ్చిన మార్పు స్త్రీలను మనుషులుగా చూపిస్తుంది. ఆమెకు కూడా సుఖ, దుఃఖాలు ఉంటాయని గుర్తు చేస్తుంది. ఆమె తప్పులు చేయగలదు..”అని మహిళల్లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది..
మల్లికా ప్రస్తుతమున్న నవతరం హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. “హీరోయిన్లు తమ శరీరాకృతిపై ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. నేను మర్డర్ సినిమా చేసేటప్పుడు చాలా మంది నాపై ఏడ్చారు. ప్రజలు ముద్దులు, బికినీల గురించి రకరకాలుగా మాట్లాడారు. కానీ దీపికా పదుకొణె గెహ్రాయాన్‌లో బికినీ వేసినట్లు.. నేను 15 ఏళ్ల క్రితమే చేశాను. కానీ అప్పుడు ప్రేక్షకులు సంకుచిత స్వభావాన్ని కలిగి ఉన్నారు. చిత్రసీమ, మీడియాలో ఓ వర్గం నన్ను మానసికంగా హింసించారని మీకు చెప్పాలి..”అని మల్లికా షెరావత్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది..