in

Malavika Mohanan responds to rumours of joining salman khan’s next!

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ డైరెక్ష‌న్‌లో ‘క‌భీ ఈద్ క‌భీ దివాళి’ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పొడుగుకాళ్ల సుంద‌రి పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. కాగా ఈ చిత్రంలో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ మాళవిక మోహ‌న‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి…తమిళ్ హీరో విజయ్ ‘మాస్టర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా..హాట్ సెన్సేషన్ గ మారింది, ఎక్సపోసింగ్ కు హద్దులే లేవంటూ ప్రొడ్యూసర్స్ కు క్లారిటీ ఇచ్చేసింది బోల్డ్ బ్యూటీ..కాగా ఇటీవలే సల్మాన్ సినిమా పై క్లారిటీ ఇచ్చింది మాళ‌విక‌..స‌ల్మాన్ ఖాన్‌తో న‌టిస్తున్నార‌న్న వార్త ఫేక్ అని తేల్చి చెప్పేసింది.

స‌ల్మాన్ ప్రాజెక్టు గురించి చాలా రాసుకొచ్చారు. కానీ తాను ఆ ప్రాజెక్టులో న‌టించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసి..పుకార్ల‌కు చెక్ పెట్టింది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం కానుంది మాళ‌విక మోహ‌న‌న్‌. ఈ ఏడాది థ‌నుష్‌తో క‌లిసి మార‌న్ సినిమాలో మెరిసింది మాళ‌విక. ప్ర‌స్తుతం హిందీలో యుధ్ర సినిమా చేస్తుండ‌గా..చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉందీ ప్రాజెక్టు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌తో స‌లార్‌, నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్టు కే, ఓం రౌత్‌తో ఆదిపురుష్ చేస్తున్నాడు. వీటి షెడ్యూల్ పై క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత మారుతి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంద‌నేది తెలిసే అవ‌కాశాలున్నాయంటున్నారు సినీజ‌నాలు.

deeksha seth latest cute stills!

no bikini effect, sonal chauhan finally gets a hit!