బుధవారం తెల్లవారుజామున ఇందిరా దేవి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విన్న సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కృష్ణ కుటుంబంలో జరిగిన రెండో విషాదమిది. జనవరిలో పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్ బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు హైదరాబాద్ పద్మాలయ స్టూడియోస్‌లో ఇందిరా దేవి పార్థివ దేహాన్నిసందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందిరా దేవి.. సూపర్ స్టార్ కృష్ణకు మొదటి భార్య. వీరిద్దరికీ రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శి అనే ఐదుగురు పిల్లలున్నారు. వీరిలో రమేశ్ బాబు, మహేశ్ బాబు టాలీవుడ్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోగా.. ప్రియదర్శి భర్త.. సుధీర్ బాబు కూడా హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు..!!