in

Mahesh babu-Trivikram eyeing Ismart beauty nabha natesh!

హేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా విడుదలైన అధికారిక ప్రకటనలో ఈ సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా ప్రకటించారు దర్శకనిర్మాతలు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతుందట.

రెండో హీరోయిన్ పాత్ర కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ నభా నటేష్ ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో హిట్ అందుకున్న నభ ఈ మధ్యనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన “అల్లుడు అదుర్స్” సినిమాతో డిజాస్టర్ ను అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు తో రొమాన్స్ చేయబోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నటిస్తున్న “మేస్ట్రో” సినిమా పై తన ఆశలన్నీ పెట్టుకున్న నభానటేష్ కు మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావటం గొప్ప విషయం అని చెప్పాలి. మరి మహేష్ బాబు తో సినిమా ఆమె కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే.

avika gor stills in short dress!

Telangana police object Bheemla nayak title song!