
పవర్ సోప్స్ కంపెనీపై ప్రముఖ సినీ నటి తమన్నా దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తన ఆరోపణలకు సంబంధించి ఆమె తగిన సాక్ష్యాలు చూపలేకపోవడంతో న్యాయస్థానం పిటిషన్‌ను తోసిపుచ్చింది. బ్రాండ్ ప్రమోషన్స్‌కు సంబంధించి తమన్నా, పవర్ సోప్స్ కంపెనీ మధ్య 2008లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2009 అక్టోబర్ వరకు తమన్నా ఫొటోలతో పవర్ సోప్స్ ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే ఒప్పందం గడువు ముగిసినప్పటికీ 2010-2011 మధ్య ఈ సంస్థ తన ఫొటోలను అనుమతి లేకపోయినప్పటికీ ఉపయోగించుకుందని తమన్నా ఆరోపించారు. ఇందుకు గాను తనకు రూ.1 కోటి పరిహారం నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఇందుకు సంబంధించి సాక్ష్యాలు చూపలేదంటూ కోర్టు తమన్నా పిటిషన్‌ను కొట్టివేసింది..!!

