
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సూ[/qodef_dropcaps] పర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ ఈ ఏడాది మేలో విడుదలైంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. 100కోట్లకు పైగా షేర్ సాధించి హిట్ లిస్ట్‌లో చేరిపోయింది. రైతుల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా కావడంతో.. దీనికి టీఆర్పీ మంచిగా వస్తుందని ఛానెల్ యాజమాన్యం ఊహించింది. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ దారుణ రేటింగ్ రావడం ఫ్యాన్స్‌ను కూడా ఇబ్బంది పెడుతోంది. ఓ స్టార్ హీరో సినిమాకు 10 లోపే రేటింగ్ రావడమేంటని వాళ్లు తల పట్టుకున్నారు. ఇక మహేష్ నటించిన కొన్ని చిత్రాలు వెండితెర మీద సరిగా ఆడకపోయినా.. బుల్లితెర మీద మంచి టీఆర్పీ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ‘అతడు’, ‘ఖలేజా’, ‘నేనొక్కడినే’ లాంటి సినిమాలు బుల్లితెరపై బ్లాక్‌బస్టర్ అయ్యాయి. అలాంటిది ఆయన ప్రతిష్టాత్మక చిత్రానికి ఇలా రేటింగ్ రావడం ఫ్యాన్స్‌ను కూడా బాగా ఇబ్బంది పెడుతోంది.